kadapa: కడప ఉక్కు కర్మాగారం ప్రాంతాన్ని సందర్శించిన చైనా బృందం

  • పరిశ్రమకు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో చైనా బృందం పర్యటన
  • ఉక్కు సీఎండీ మధుసూదనరావుతో కలసి పరిశీలన
  • ఫ్యాక్టరీకి కావాల్సిన వనరులన్నీ ఉన్నాయని తెలిపిన సీఎండీ

కడప ఉక్కు కర్మాగారం నిర్మాణానికి సంబంధించి మరో అడుగు పడింది. పరిశ్రమకు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో చైనా దేశ ప్రతినిధుల బృందం పర్యటించింది. మైలవరం మండల పరిధిలోని ఎం.కంభాలదిన్నె గ్రామ సమీపంలో గత డిసెంబరులో స్టీల్ ఫ్యాక్టరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతాన్ని రాయలసీమ స్టీల్ కార్పోరేషన్ (ఆర్.ఎస్.సి) సీఎండీ మధుసూదనరావుతో కలసి చైనా బృంద సభ్యులు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి అవసరమైన భూమి, నీరు, విద్యుత్తు, రహదారులు తదితర వనరులన్నీ అందుబాటులో ఉన్నాయని చైనా బృందంలోని టోనీ టాయ్, జియోజీ యువాన్, జె.పార్క్ లకు మధుసూదనరావు వివరించారు.

More Telugu News