Sonakshi Sinha: రాజమౌళి సినిమాలో సోనాక్షి .. అలియా భట్?

  • షూటింగు దశలో రాజమౌళి మూవీ
  • తెరపైకి బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు
  •  2020లో ప్రేక్షకుల ముందుకు  

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా ఒక మల్టీస్టారర్ రూపొందుతోంది. ఆల్రెడీ ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగును జరుపుకుంటోంది. మూడవ షెడ్యూల్ నుంచి కథానాయికల కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించవలసి వుంది. అందువలన కథానాయికల ఎంపిక ప్రక్రియపై దృష్టిపెట్టారు.ఈ సినిమాకి ముగ్గురు కథానాయికలు అవసరం కావడంతో, ఒక కథానాయికగా పరిణితీ చోప్రాను తీసుకోవాలనే ఉద్దేశంతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక మిగతా నాయికల పాత్రల కోసం సోనాక్షి సిన్హా తోను .. అలియా భట్ తోను సంప్రదింపులు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. త్వరలోనే కథానాయికల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. 2020లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

More Telugu News