Narendra Modi: పరీక్షలంటే భయం వద్దు... జీవితమనే సవాల్ ను స్వీకరించండి: విద్యార్థులతో నరేంద్ర మోదీ

  • 2 వేల మంది విద్యార్థులతో 'పరీక్షా పే చర్చ'
  • పరీక్షలు జీవన్మరణ సమస్య కాదు
  • ర్యాంకులను చూడవద్దని ప్రధాని పిలుపు
  • భవిష్యత్తు విద్యార్థులదేనన్న నరేంద్ర మోదీ

విద్యార్థులు పరీక్షలంటే భయపడరాదని, ముందున్న జీవితమనే సవాల్ ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. 24 రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న సుమారు 2 వేల మందికి పైగా విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 'పరీక్షా పే చర్చ' కార్యక్రమం నిర్వహించిన ఆయన, విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

పరీక్షలను జీవన్మరణ సమస్యగా ఎన్నడూ చూడవద్దని సూచించిన ఆయన, అసలైన సవాలు జీవితమని గ్రహించాలని అన్నారు. భారతదేశ భవిష్యత్తు ఈ విద్యార్థులదేనని, తనకు దేశ భవిష్యత్ కనిపిస్తోందని చెప్పారు. పరీక్షల్లో ఒత్తిడిని అధిగమించేందుకు మెలకువలను చెప్పిన మోదీ, క్రమానుగుణంగా పాఠ్యాంశాలను చదవడం ద్వారా చాలా సులువుగా ఉత్తీర్ణతను సాధించవచ్చని అన్నారు. ర్యాంకులను మాత్రమే చూడరాదని, ర్యాంకులు తెచ్చుకోలేని ఎంతో మంది జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుని ఎంతోమందికి మార్గదర్శకులుగా నిలిచారని అన్నారు.

More Telugu News