Snap Deal: ధరలను అమాంతం పెంచి డిస్కౌంట్లు ఇస్తున్న స్నాప్ డీల్: సీఈఆర్సీ నివేదిక

  • దొంగ డిస్కౌంట్లను చూపిస్తూ మోసం
  • పూర్తి స్థాయి దర్యాఫ్తు చేయాలి
  • సీఈఆర్సీ నివేదిక

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్ డీల్ ఆన్ లైన్ లో దొంగ డిస్కౌంట్లను చూపిస్తూ, కస్టమర్లను మోసం చేస్తోందని అహ్మదాబాద్ కు చెందిన సీఈఆర్సీ (కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్) పేర్కొంది. భారీ డిస్కౌంట్లను చూపించేందుకు గరిష్ఠ చిల్లర ధరను అమాంతం పెంచుతోందని ఆరోపించింది. సీఈఆర్సీ ఓ నివేదికను విడుదల చేస్తూ, స్నాప్ డీల్ విక్రయిస్తున్న కాస్మెటిక్ ప్రొడక్టులపై గడువు తేదీని కూడా ముద్రించడం లేదని పేర్కొంది.

అరకొర లేబులింగ్, అధిక ధరలతో మోసం చేస్తున్న స్మాప్ డీల్ పై డీజీసీఐ (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) చర్యలు చేపట్టాలని సూచించింది. పలు హానికారక ఉత్పత్తులను కస్టమర్లకు స్నాప్ డీల్ విక్రయించిందని, వాటిని వెనక్కు తీసుకుని, పరిహారం చెల్లించాలని సూచించింది. స్నాప్ డీల్ లో పారదర్శకత లేదని, పాలసీ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ఉత్పత్తుల వారీగా విక్రయాలపై పూర్తి స్థాయిలో దర్యాఫ్తు చేయాల్సిన అవసరం ఉందని సీఈఆర్సీ సీజీఎం ప్రీతి షా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

More Telugu News