Sunny Leone: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మరో ఐటెం సాంగ్ చేస్తున్న సన్నీలియోన్ 
  • పొల్లాచ్చిలో ముగించిన మహేశ్ బాబు
  •  రకుల్ కి ఆ సినిమా టర్నింగ్ పాయింట్  

*  బాలీవుడ్ శృంగారతార సన్నీ లియోన్ తాజాగా ఓ మలయాళ చిత్రంలో ఐటెం సాంగు చేస్తోంది. ప్రముఖ నటుడు మమ్ముట్టి నటిస్తున్న 'మధుర రాజ్' చిత్రంలో ఈ ఐటెం పాటను చేసింది.
*  మహేశ్ బాబు నటిస్తున్న 'మహర్షి' చిత్రం తాజా షెడ్యూలు ముగిసింది. తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఈ షెడ్యూలులో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ వచ్చే నెలలో జరుగుతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
*  ప్రస్తుతం తమిళంలో చేస్తున్న 'ఎన్.జి.కె' చిత్రం తనకి టర్నింగ్ పాయింట్ అవుతుందని అంటోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తాను ఛాలెంజింగ్ పాత్రను చేస్తున్నానని, దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నానని చెప్పింది.

More Telugu News