Hyderabad: కొనసాగుతున్న ద్రోణి ప్రభావం.. వణుకుతున్న హైదరాబాద్

  • చల్లటి గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
  • మరో రెండు రోజులు ఇదే పరిస్థితి
  • బుసకొడుతున్న వైరల్ జ్వరాలు

విదర్భ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం తెలంగాణపై కొనసాగుతోంది. ఫలితంగా హైదరాబాదీలు చలికి తట్టుకోలేక వణుకుతున్నారు. చలికాలంలోనూ లేనంత చలిగాలులు వీస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు తట్టుకోలేకపోతున్నారు. తెలంగాణలో నేడు, రేపు ఈదురు గాలుల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  

ద్రోణి ప్రభావంతో శనివారం నుంచి వర్షాలు కురుస్తుండగా, సోమవారం చల్లటి గాలులతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదు కాగా, గరిష్టంగా 21 డిగ్రీలు నమోదైంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో వైరల్ జ్వరాలు మళ్లీ బుసకొడుతున్నాయి. స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, శ్వాసకోస వ్యాధిగ్రస్థులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

More Telugu News