kohli: రిచర్డ్స్, హాన్సీ క్రోనేల రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ

  • కెప్టెన్ గా 47 వన్డేలను గెలిపించిన కోహ్లీ
  • 46 మ్యాచ్ లను గెలిపించిన రిచర్డ్స్, క్రోనే
  • 50 విజయాలతో అగ్ర స్థానంలో ఉన్న లాయిడ్, పాంటింగ్

సూపర్ ఫామ్ లో కొనసాగుతూ పలు రికార్డులను సొంతం చేసుకుంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... కెప్టెన్ గా కూడా రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఈరోజు న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో విజయం సాధించి, ఓ అరుదైన రికార్డును తన ఖాతాలోకి వేసుకున్నాడు. ఇప్పటి వరకు 63 వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీ... 47 వన్డేల్లో భారత్ కు విజయాలు అందించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్, దక్షిణాఫ్రికా దివంగత కెప్టెన్ హాన్సీ క్రొనేలను వెనక్కి నెట్టేశాడు. వీరిద్దరూ కెప్టెన్లుగా 46 మ్యాచ్ లను గెలిపించారు. కోహ్లీ కంటే ముందు విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ లు ఉన్నారు. 50 విజయాలతో వీరిద్దరూ అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు.

More Telugu News