Priya Prakash: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నాని చిత్రంలో మలయాళ బ్యూటీ 
  • సైంటిఫిక్ థ్రిల్లర్ లో విజయ్ దేవరకొండ 
  • 'అంతరిక్షం' దర్శకుడి మరో చిత్రం

*  నాని హీరోగా విక్రం కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో మొత్తం ఆరుగురు కథానాయికలు నటిస్తారట. వీరిలో ఒక నాయిక పాత్ర కోసం మలయాళ సెన్సేషన్ ప్రియాప్రకాశ్ వారియర్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే నెల 19 నుంచి షూటింగ్ మొదలవుతుంది.
*  'నోటా' చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ మళ్లీ ఓ తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంలో నటించడానికి అంగీకరించాడు. ఇది టైం మెషిన్ నేపథ్యంలో సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందుతుందని తెలుస్తోంది.
*  ఇటీవల వరుణ్ తేజ్ హీరోగా 'అంతరిక్షం' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి మరో చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అంటార్కిటికాలో జరిగే పరిశోధనల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం.

More Telugu News