sarfraj ahmed: జాతి వివక్ష వ్యాఖ్యల ఫలితం.. పాక్ క్రికెట్ కెప్టెన్ పై వేటు

  • దక్షిణాఫ్రికా క్రికెటర్ పై సర్ఫరాజ్ జాతి వివక్ష వ్యాఖ్యలు
  • నాలుగు మ్యాచ్ ల నిషేధం విధించిన ఐసీసీ
  • తాత్కాలిక కెప్టెన్ గా షోయబ్ మాలిక్ నియామకం

దక్షిణాఫ్రికా క్రికెటర్ అండిలె ఫెలుక్వాయోపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పై ఐసీసీ వేటు వేసింది. సర్ఫరాజ్ పై నాలుగు మ్యాచ్ ల నిషేధం విధిస్తున్నామని ఐసీసీ ప్రకటించింది. సర్ఫరాజ్ ఉద్దేశపూర్వకంగానే జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఐసీసీ తెలిపింది. ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించిన అతనిపై వేటు వేస్తున్నామని ప్రకటించింది. జాతి, మతం, రంగు, భాష, సంస్కృతిని కించపరిచేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా ఉపేక్షించబోమని హెచ్చరించింది.

మరోవైపు సర్ఫరాజ్ పై వేటు పడటంతో... దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మరో రెండు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లకు అతను దూరం కానున్నాడు. అతని స్థానంలో షోయబ్ మాలిక్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు. ఈ సందర్భంగా షోయబ్ మాట్లాడుతూ, ఏం జరిగిందో మనందరికీ తెలుసని... దానిపై తాను స్పందించబోనని చెప్పాడు. తనకు కెప్టెన్ గా అవకాశం ఇచ్చారని... తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతానని తెలిపాడు.

More Telugu News