Karnataka: నెటిజన్లను తెగ ఆకర్షిస్తోన్న 'జొన్న కంకుల' బామ్మ!

  • ఆదర్శంగా నిలుస్తున్న సెల్వమ్మ
  • మొక్కజొన్న కంకులు విక్రయిస్తూ జీవనం
  • సోలార్ ఫ్యాను సాయంతో వ్యాపారం

75 ఏళ్ల వయసులో తన కష్టార్జితంతో తాను బతుకుతూ ఒక బామ్మ ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తోంది. అయితే తన కష్టంలోనూ ఆమె ప్రత్యేకతను చాటుకుంటోంది. టెక్నాలజీని వాడుకుంటూ తన పనిని సులువుగా చేసుకుపోతోంది... బెంగుళూరుకు చెందిన 75 ఏళ్ల సెల్వమ్మ. కర్ణాటక రాష్ట్ర విధాన సౌధ ఎదురుగా మొక్కజొన్న కంకులు విక్రయిస్తూ ఉంటుంది.

అయితే ఆమె సోలార్ ఫ్యానును అమర్చి, దాని ద్వారా వచ్చే గాలితో బొగ్గులపై మొక్కజొన్న కంకులను కాలుస్తూ వ్యాపారం సాగిస్తోంది. సెల్వమ్మ సోలార్ ఫ్యాన్ సాయంతో వ్యాపారం సాగిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.

More Telugu News