Andhra Pradesh: చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారికకు పద్మశ్రీ.. ప్రశంసించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు!

  • ఇది తెలుగు క్రీడాకారులందరికీ సత్కారం
  • భవిష్యత్ లో హారిక మరిన్న విజయాలు సాధించాలి
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి

గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో వేర్వేరు రంగాల్లో రాణించిన ప్రముఖులకు కేంద్రం భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెస్ క్రీడాకారిణి, తెలుగమ్మాయి ద్రోణవల్లి హారికకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయమై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో స్పందించారు. హారికకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించడం తెలుగు క్రీడాకారులందరికీ జరిగిన సత్కారంగా భావిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు.

ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘పిన్న వయసులోనే చదరంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మన గుంటూరు ఆడబిడ్డ @HarikaDronavali ను అభినందిస్తూ వారిని పద్మశ్రీ అవార్డుతో సత్కరించటం తెలుగు క్రీడాకారులందరికీ జరిగిన సత్కారంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో మీరు మరెన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాను’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

More Telugu News