surya: సూర్య మూవీ టీజర్ కి ముహూర్తం ఖరారు

  • సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'ఎన్జీకే'
  • ఫిబ్రవరి 14వ తేదీన టీజర్ రిలీజ్
  • ఏప్రిల్ 14వ తేదీన సినిమా విడుదల    

సూర్య కథానాయకుడిగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 'ఎన్జీకే' చిత్రం రూపొందింది. ఇటీవలే షూటింగు పార్టును పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇంతవరకూ చేయని ఒక విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలో సూర్య కనిపించనున్నాడు. ఈ సినిమా తమిళ టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఫిబ్రవరి 14వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. టీజర్ తోనే అంచనాలు పెంచేలా సెల్వ రాఘవన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. రకుల్ .. సాయిపల్లవి కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

More Telugu News