India: పద్మశ్రీ అవార్డును తిరస్కరించిన గీతా మెహతా!

  • రాజకీయంగా మంచిదికాదన్న రచయిత్రి
  • క్షమించాలని కోరిన ఒడిశా సీఎం సోదరి
  • 21 భాషల్లో అనువాదమైన గీత పుస్తకాలు

భారత 70వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో నిన్న రాత్రి వేర్వేరు రంగాల్లో రాణించిన ప్రముఖులకు భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. ఇందులో భాగంగా ఒడిశా సీఎం సోదరి, రచయిత్రి గీతా మెహతాకు పద్మశ్రీ అవార్డును ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్లు గీత సంచలన ప్రకటన చేశారు. తనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించినందుకు నిజంగా గర్వపడుతున్నాననీ, ఈ అవార్డును తిరస్కరించినందుకు క్షమించాలని వ్యాఖ్యానించారు.

త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అవార్డును స్వీకరిస్తే రాజకీయంగా తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవార్డును స్వీకరించడం, తనతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా మంచిదికాదని వ్యాఖ్యానించారు. అందుకే ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆల్ప్రెడ్ ఎ.నోఫ్ పబ్లిషింగ్ హౌస్ అధిపతి సోనీ మెహతాను గీత పెళ్లి చేసుకున్నారు. గీత రాసిన పుస్తకాలు 21 భాషల్లోకి అనువాదమయ్యాయి.

More Telugu News