ntr: 'బిగ్ బాస్ 3'కి హోస్ట్ గా ఎన్టీఆర్ ఖరారైపోయినట్టే!

  • 'బిగ్ బాస్'కి హోస్ట్ గా మెప్పించిన ఎన్టీఆర్
  • సీజన్ 2కి హోస్ట్ గా నాని 
  • సీజన్ 3కి జరుగుతోన్న సన్నాహాలు    

ఆ మధ్య 'స్టార్ మా' ఛానల్లో ప్రసారమైన 'బిగ్ బాస్' ఫస్ట్ సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ వేదికపై ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ కార్యక్రమంతో ఛానల్ రేటింగ్స్ పెరగడంలో ఎన్టీఆర్ ముఖ్యమైన పాత్రను పోషించాడనే చెప్పాలి. ఆ తరువాత ప్రసారమైన సీజన్ 2కి నాని హోస్ట్ గా వ్యవహరించి, తనదైన శైలిలో మెప్పించాడు. ఇక ఇప్పుడు 3వ సీజన్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సీజన్ కి చిరంజీవి గానీ .. వెంకటేశ్ గాని హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపించింది. కానీ తాజాగా ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ తోనే సీజన్ 3 చేయాలనే ఉద్దేశంతో 'బిగ్ బాస్ 3' నిర్వాహకులు ఉన్నారట. అందువలన ఆయనని ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయని సమాచారం. ఎన్టీఆర్ అంగీకరించాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ .. రాజమౌళి సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ షూటింగుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా 'బిగ్ బాస్ 3' షూటింగును ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక సినిమాకి ఎన్టీఆర్ ఎంత పారితోషికం తీసుకుంటాడో .. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా ఆయన అంతే మొత్తం తీసుకుంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

ntr

More Telugu News