Rahul Gandhi: కిందపడిపోయిన ఫొటోగ్రాఫర్ ను పైకి లేపి, పెద్ద మనసు చాటుకున్న రాహుల్ గాంధీ

  • భువనేశ్వర్ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం
  • ఫొటోలు తీస్తూ కాలు జారి పడ్డ ఫొటోగ్రాఫర్
  • హుటాహుటిన కిందకు వచ్చి ఫొటోగ్రాఫర్ ను పైకి లేపిన రాహుల్

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భువనేశ్వర్ పర్యటన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాహుల్ వస్తున్న సమయంలో ఫొటోలు తీస్తున్న ఓ ఫొటోగ్రాఫర్... వెనక్కి వెళ్తూ, కాలు జారి, రెండు మెట్లపై నుంచి కింద పడ్డాడు. ఆ తర్వాత మళ్లీ ఓ పల్టీ కొట్టాడు. వెంటనే అప్రమత్తమైన రాహుల్ గాంధీ... హుటాహుటిన మెట్లు దిగి వచ్చి, ఫొటోగ్రాఫర్ కు చేయి అందించి, పైకి లేపారు. చుట్టూ ఉన్న వారందరికంటే రాహులే ముందుగా స్పందించడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి రాహుల్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. రాహుల్ పెద్ద మనసును చాటుకున్నారని కితాబిస్తున్నారు.

More Telugu News