ntr: రాజమౌళి సినిమాలో పరిణీతి చోప్రా?

  • షూటింగు దశలో రాజమౌళి మూవీ
  • 1920 కాలం నాటి నేపథ్యంలో సాగే కథ
  • తెరపైకి పరిణీతి చోప్రా పేరు        

ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ మల్టీ స్టారర్ రూపొందుతోంది. 'ఆర్ ఆర్ ఆర్' వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలకు చోటు వున్నట్టుగా సమాచారం. ఒక కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

తాజాగా పరిణీతి చోప్రా పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమా టీమ్ పరిణీతి చోప్రాను సంప్రదించగా, ఆమె భారీ మొత్తంలో పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. తాము అనుకున్న పాత్రకి పరిణీతి అయితేనే బాగుంటుందని భావించిన టీమ్, ఆమె అడిగిన పారితోషికాన్ని ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. 1920 కాలం నాటి నేపథ్యంలో ఈ కథ సాగుతుందనీ, ఇందులో బందిపోటుగా ఎన్టీఆర్ .. పోలీస్ ఆఫీసర్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారని తెలుస్తోంది.

More Telugu News