sensex: మళ్లీ నష్టాల బాట పట్టిన మార్కెట్లు.. ఆటో, మెటల్, రియాల్టీ స్టాకుల ఎఫెక్ట్

  • ఒత్తిడికి గురైన ఆటోమొబైల్స్, మెటల్, రియాల్టీ స్టాకులు
  • 169 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 69 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాంతాన్ని నష్టాలతో ముగించాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు లాభాల్లోనే కొనసాగాయి. అయితే, మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుంచి మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఆటోమొబైల్స్, మెటల్, రియాల్టీ స్టాకులు ఒత్తిడికి గురవడం మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 169 పాయింట్లు నష్టపోయి 36,025కు పడిపోయింది. నిఫ్టీ 69 పాయింట్లు కోల్పోయి 10,780 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ లో మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్ తదితర కంపెనీలు నష్టపోయాయి. యస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, భారతి ఎయిర్ టెల్, టీసీఎస్, వేదాంత లిమిటెడ్ తదితర కంపెనీలు లాభపడ్డాయి.

More Telugu News