Andhra Pradesh: ఏపీలో మేం ఎలాంటి సర్వేలు నిర్వహించడం లేదు!: టీడీపీ నేత డొక్కా

  • వైసీపీ నేతల ఆరోపణలు సరికాదు
  • ఓట్ల నమోదు నిరంతర ప్రక్రియ
  • మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్సీ

విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో ఉన్న కుమిలిలో ఓటర్ల జాబితాతో సర్వే నిర్వహిస్తున్న నలుగురిని వైసీపీ నేతలు పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. వైసీపీ మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నేత బొత్స ఆరోపించారు. తాజాగా బొత్సతో పాటు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఖండించారు.

ఓటర్ల నమోదు అన్నది నిరంతర ప్రక్రియ అనీ, ఇదంతా ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుందని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు చెబుతున్నట్లు ఇష్టానుసారం ఓట్లను తొలగించడం సాధ్యం కాదని తెలిపారు. అవసరమైతే ఈ విషయంలో విచారణ జరపాలని కోరారు. వైసీసీలో సీనియర్ నేతలు ఇలాంటి ఆరోపణలు చేయడం నిజంగా దురదృష్టకరమని అన్నారు.

ఏపీలో టీడీపీ ఎలాంటి సర్వేలు చేయించడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు వైసీపీ నేత మజ్జి శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కుమిలి పోలీస్ స్టేషన్ ముందు భారీగా వైసీపీ కార్యకర్తలు గుమిగూడారు. దీంతో అధికారులు భారీగా పోలీసులను మోహరించారు.

More Telugu News