raviteja: పారితోషికం తగ్గించుకున్న రవితేజ?

  • వరుస పరాజయాలతో రవితేజ
  • రేపు రవితేజ పుట్టినరోజు
  • వీఐ ఆనంద్ సినిమా నుంచి ఫస్టులుక్

రవితేజ పారితోషికం విషయంలో చాలా కరెక్ట్ గా ఉంటాడనే టాక్ ఇండస్ట్రీలో చాలాకాలంగా వినిపిస్తోంది. పరాజయాలు పలకరించినా ఆయన తన పారితోషికాన్ని తగ్గించుకోడని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటూ వుంటారు. ఆ మధ్య కూడా రవితేజ తన పారితోషికం విషయంలో మెట్టుదిగి రాకపోవడంతో రెండు మూడు ప్రాజెక్టులు ఆగిపోయిన విషయం తెలిసిందే.

రీసెంట్ గా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించనున్న సినిమా విషయంలోను ఇదే పరిస్థితి తలెత్తినట్టుగా చెప్పుకున్నారు. రవితేజ హీరోగా ఆ మధ్య వచ్చిన 'టచ్ చేసి చూడు'.. 'నేల టికెట్' .. 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాలు వరుస పరాజయాలను అందుకున్నాయి. ఈ ప్రభావం రవితేజ తదుపరి సినిమాపై ఉంటుంది కనుక, పారితోషికం తగ్గించుకోమన్నారట. మొదట ససేమిరా అన్న రవితేజ .. ఆ తరువాత అందుకు అంగీరించాడని టాక్. ఇక రవితేజ పుట్టినరోజు సందర్భంగా రేపు ఈ సినిమా నుంచి టైటిల్ తో కూడిన ఫస్టులుక్ రానుందని తెలుస్తోంది. 

More Telugu News