Supreme Court: అగ్రవర్ణ పేదల 10 శాతం రిజర్వేషన్ కోటాను ఆపలేము: స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు

  • రిజర్వేషన్ల చెల్లుబాటు అంశాన్ని పరిశీలిస్తాం
  • నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్రానికి ఆదేశం
  • గతంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీం

అగ్రవర్ణాల్లోని పేదలకు కేంద్రం ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లపై స్టే ఇవ్వలేమని కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే, ఈ రిజర్వేషన్ల చెల్లుబాటు అంశాన్ని విచారించి పరిశీలిస్తామని పేర్కొంది. 10 శాతం రిజర్వేషన్లు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని, దీనిపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారించిన అత్యున్నత ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. రిజర్వేషన్లపై పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా, రిజర్వేషన్లు 50 శాతాన్ని మించరాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News