తెలంగాణలో రెండేళ్ల పాపపై అత్యాచారం.. నిందితుడిని పట్టిచ్చిన సీసీటీవీలు!

25-01-2019 Fri 11:00
  • మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ లో ఘటన
  • చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగుడు 
  • తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్
తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం ఇంట్లో ఆడుకుంటున్న ఓ చిన్నారి(2)ని ఎత్తుకెళ్లిన దుండగుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా బాలిక గట్టిగా కేకలు పెట్టడంతో ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఇంట్లో చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు వెతుకులాట ప్రారంభించారు.

దీంతో కొద్దిదూరంలోనే రక్తస్రావంతో ఏడుస్తున్న బాలిక కనిపించింది. ఆమెను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ విషయంలో తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితుడిని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.