Mahesh Babu: సుకుమార్ సినిమా కోసం రఫ్ లుక్ తో కనిపించనున్న మహేశ్ బాబు?

  • మహేశ్ బాబుతో సుకుమార్ మూవీ
  • చకచకా జరుగుతోన్న పనులు
  • అటవీ నేపథ్యంలో సాగే కథ     

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ విదేశీ నేపథ్యంలో 'నాన్నకు ప్రేమతో' సినిమా చేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గెడ్డం .. మీసాలతో కొత్త లుక్ తో కనిపించాడు. ఆ సినిమా ఎన్టీఆర్ కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. ఆ తరువాత సుకుమార్ గ్రామీణ నేపథ్యంలో చరణ్ కథానాయకుడిగా 'రంగస్థలం' సినిమా చేశాడు. పెరిగిన గెడ్డంతో చరణ్ కనిపించిన ఈ సినిమా ఆయన కెరియర్లోనే ఒక మైలురాయిగా నిలిచింది.

ఇక సుకుమార్ తన తదుపరి సినిమాను మహేశ్ తో చేయనున్నాడు. ఆల్రెడీ స్క్రిప్ట్ ను రెడీ చేసిన సుకుమార్, ఈ సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా వున్నాడు. ఈ కథ అంతా కూడా అటవీ నేపథ్యంలో స్మగ్లింగ్ ప్రధానంగా సాగనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు పాత్ర ఏమిటనే విషయం తెలియదు గానీ, పెరిగిన గెడ్డంతో రఫ్ లుక్ తో కనిపిస్తాడనే టాక్ ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. సాధారణంగా మహేశ్ బాబు స్మార్ట్ గా కనిపించడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. మరి ఈ వార్తలో వాస్తవమెంతన్నది చూడాలి. 

More Telugu News