literary fest: హైదరాబాద్‌లో నేటి నుంచి మూడు రోజులపాటు లిటరరీ ఫెస్టివల్‌

  • బేగంపేట్‌ హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో వేడుక
  • భాషాభిమానులకు పండుగే పండగ
  • హాజరుకానున్న చైనా, గుజరాతీ కవులు

భాషాభిమానులకు తీపికబురు. హైదరాబాద్‌లోని బేగంపేట్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు లిటరరీ వేడుకలు జరగనున్నాయి. ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ఫెస్టివల్‌కు ప్రపంచంలోని ఒక్కో దేశ సాహితీ వేత్తలను, జాతీయ స్థాయిలో ఒక్కో రాష్ట్ర కవులు, రచయితలను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తారు.

ఇక ఈ ఏడాది చైనా కవులు, గుజరాతీ రచయితలు ప్రత్యేక ఆహ్వానితులుగా ఫెస్ట్‌లో పాల్గొంటున్నారు. అలాగే  ప్రముఖ ఉర్దూ కవి కైఫే ఆజ్మీ, నాట్య కళాకారిణి మృణాలిని సారాబాయి శతజయంతి సంస్మరణ కార్యక్రమాలు ఫెస్ట్ లో ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని గాంధీ ఆలోచనలు, సాహిత్యం, సినిమా వంటి అంశాలపై చర్చాగోష్ఠి జరుగుతుంది. కార్యక్రమాన్ని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి, సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, గుజరాతీ సాహితీవేత్త సితాన్షు యశస్వి, చైనా కవి ఏ లీ ప్రారంభించనున్నారు.

More Telugu News