Assembly Elections: శాసనసభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేతలు

  • ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు
  • అనర్హత వేటు వేయాలి
  • అక్రమాలతో గెలిచారన్న రేవంత్

శాసనసభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేదని టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌, మాజీ మంత్రి డీకే ఆరుణ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు.

ఎన్నికల నియమావళి ఉల్లంఘనతోపాటు కౌంటింగ్‌లో అవకతవకలకు పాల్పడిన వారిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు. ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలతో కొడంగల్‌లో నరేందర్ రెడ్డి గెలిచారని.. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలంటూ రేవంత్ పిటీషన్ దాఖలు చేశారు. పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా వచ్చాయని.. అలా తేడా రావడం ఎన్నికల నియమావళి ఉల్లంఘనేనని పేర్కొంటూ డీకే అరుణ పిటీషన్‌లో పేర్కొన్నారు.

More Telugu News