Nagarjuna: 'మన్మథుడు 2' కోసం యూరప్ లో నాగ్ రెండు నెలల మకాం

  • 2002లో వచ్చిన 'మన్మథుడు'
  • నాగ్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమా
  • మార్చి 2వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్  

నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో 'మన్మథుడు' ఒకటిగా కనిపిస్తుంది. కథ - మాటలు త్రివిక్రమ్ అందించిన ఈ సినిమాకి కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు. 2002లో వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత చాలాకాలం పాటు నాగార్జున టాలీవుడ్ మన్మథుడు గానే పిలవబడ్డారు. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి రంగం సిద్ధమైంది.

యువ నటుడు .. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. కథ ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన అధిక భాగం చిత్రీకరణ యూరప్ లో జరగనుంది. అందువలన 2 నెలలపాటు నాగార్జున యూరప్ లోనే ఉండనున్నారు. ఫిబ్రవరి 3వ వారంలో ఈ సినిమాను లాంచ్ చేసి .. మార్చి 2వ వారంలో రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు. ప్రస్తుతం కథానాయికను ఎంపిక చేసే పనిలో వున్నారు. కథానాయికగా ఎవరికి ఛాన్స్ దొరుకుతుందో చూడాలి. 

More Telugu News