sensex: కోలుకున్న దేశీయ మార్కెట్లు

  • రెండు సెషన్ల తర్వాత లాభాల బాట పట్టిన మార్కెట్లు
  • చివరి గంటలో కోలుకున్న సూచీలు
  • 87 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ లాభాల బాట పట్టాయి. గత రెండు సెషన్లుగా నష్టాలను చవిచూసిన మార్కెట్లు... ఈరోజు కూడా ఒడిదుడుకులకు గురైనప్పటికీ, చివరి గంటలో కోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, యస్ బ్యాంక్ లాంటి కంపెనీలు రాణించడం మార్కెట్లకు కలసి వచ్చింది. దీంతో, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 87 పాయింట్లు లాభపడి 36,195కి పెరిగింది. నిఫ్టీ 18 పాయింట్లు కోలుకుని 10,849 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ లో యస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ తదితర కంపెనీలు లాభపడ్డాయి. టాటా మోటార్స్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీలు నష్టపోయాయి.

More Telugu News