మెగాహీరో తదుపరి సినిమాకి ముహూర్తం ఫిక్సయింది

- 'ఎఫ్ 2'తో హిట్ కొట్టిన వరుణ్ తేజ్
- 'జిగర్తాండ' రీమేక్ కి సన్నాహాలు
- ఈ నెల 27న పూజా కార్యక్రమాలు
తమిళంలో బాబీ సింహా విలన్ షేడ్స్ కలిగిన డాన్ పాత్రలో కనిపిస్తాడు. తెలుగులో ఈ పాత్రను చేయడానికి వరుణ్ తేజ్ అంగీకరించాడు. ఇక సిద్ధార్థ్ పాత్రకు మరో యంగ్ హీరోను ఎంపిక చేయవలసి వుంది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. రామ్ ఆచంట - గోపీనాథ్ ఆచంట నిర్మిస్తోన్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.