ఆదినారాయణ, సుబ్బారెడ్డి రాజకీయ విశ్రాంతి తీసుకుంటే మంచిది: జమ్మలమడుగు వైసీపీ సమన్వయకర్త సుధీర్‌రెడ్డి సలహా

- వాళ్లకు వయసై పోయింది
- అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇన్నాళ్లు కమీషన్లు దండుకున్నారు
- ఇంకా ఎందుకు ఎన్నికల ఆరాటం
టికెట్ పంచాయతీ నేపథ్యంలో నేడు ఇద్దరు నేతలు తమ పార్టీ అధినేత చంద్రబాబును కలిసేందుకు వెళ్లిన సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఇలా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయినా పోటీ చేయాలనుకుంటే చేయవచ్చన్నారు. నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉందని, రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని జోస్యం చెప్పారు. ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనుండడంతో మళ్లీ సీఎం చంద్రబాబు హామీల వర్షం కురిపిస్తూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.