చిన్నారిపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు

- హైదరాబాద్ మొదటి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు తీర్పు
- గత ఏడాది ఫిబ్రవరిలో ఘటన
- కేసు నమోదు చేసిన మారేడుపల్లి పోలీసులు
గత ఏడాది ఫిబ్రవరిలో ఈ చిన్నారులు సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్లారు. ఈ సమయంలో అదే బస్తీకి చెందిన పి.అనిల్‌కుమార్ (50) వారిని పిలిచి చాక్లెట్లు ఇస్తానని నమ్మించి తన వెంట తీసుకువెళ్లాడు. అనంతరం ఓ బాలికపై లైంగిక దాడిచేసి, మరో బాలికను బెదిరించాడు. విషయం తెలిసిన బాధిత చిన్నారుల తల్లిదండ్రులు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు అనిల్ కుమార్‌ను అరెస్టుచేసి కోర్టు ముందుంచారు. కేసు విచారించిన న్యాయమూర్తి నిందితుడు నేరం చేశాడని రుజువు కావడంతో ఈ విధంగా తీర్పు చెప్పారు.