శివైక్యం చెందేముందు కూడా... స్వయంగా భస్మధారణ చేసుకుంటున్న శివకుమార స్వామి... వీడియో!

24-01-2019 Thu 11:44
  • సోమవారం నాడు పరలోకాలకేగిన శివకుమార స్వామి
  • నడిచే దేవుడిగా కన్నడిగుల పూజలందుకున్న సిద్ధగంగ మఠాధిపతి
  • చివరి రోజుల్లో ఆసుపత్రి వీడియో!
శివకుమారస్వామి... కర్ణాటకలోని తుముకూరులో ఉన్న ప్రసిద్ధ సిద్ధగంగ మఠాధిపతి. ఆయన గత సోమవారం నాడు 111 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో శివైక్యం చెందిన సంగతి తెలిసిందే. అంతకుముందు రెండు వారాల పాటు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. నడిచే దేవుడిగా కన్నడిగులు చెప్పుకునే శివకుమార స్వామి, తాను మరణించే ముందు కూడా శివనామస్మరణను, విభూది ధారణనూ వీడలేదు. ఆసుపత్రి బెడ్ పై నోట్లోకి గొట్టాలు పెట్టివున్న పరిస్థితుల్లో, శ్రీ రుద్ర మంత్రాలు వింటూ స్వయంగా భస్మధారణ చేసుకుంటున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివకుమార స్వామిలో ఉన్న పూర్వపు ఆచరణలూ, సంప్రదాయిక వాసనలు స్పృహలోలేని పరిస్థితుల్లోనూ శివారాధన చేయిస్తోందని భక్తులు కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.