akhil: నా వయసుకు లవ్ స్టోరీలే కరెక్ట్: అఖిల్

  • 'మిస్టర్ మజ్ను'నాకు సరైన సినిమా
  • నా నుంచి ఆశించే కొత్తదనం ఉంటుంది
  • అయిదేళ్ల పాటు ప్రేమకథా చిత్రాలే చేస్తాను      

అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' నిర్మితమైంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా నిర్మితమైన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ .."ఇంతకుముందు నేను చేసిన 'అఖిల్' .. 'హలో' సినిమాల సంగతి పక్కన పెడితే, 'మిస్టర్ మజ్ను' నాకు సరైన సినిమా. గత చిత్రాల అనుభవం తరువాత నాకు నేనుగా ఆత్మ విమర్శ చేసుకున్నాను ..అందులో నుంచి వచ్చినదే ఈ సినిమా.

నా నుంచి మీరు ఆశించే కొత్తదనం ఈ సినిమా నుంచి తప్పకుండా లభిస్తుంది. నా బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ .. యాక్షన్ .. ఇలా ప్రతి విషయంలో కొత్తదనానికి ప్రయత్నిస్తూ వచ్చాము. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకం నాకు వుంది. నా వయసుకు లవ్ స్టోరీస్ చేయడమే కరెక్ట్. అందువలన ఒక అయిదేళ్ల పాటు లవ్ స్టోరీస్ చేయాలనే నిర్ణయించుకున్నాను. ఇక నా తదుపరి సినిమా ఏమిటనేది త్వరలో చెబుతాను. మార్చిలో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లొచ్చు" అని చెప్పుకొచ్చాడు. 

More Telugu News