Boeing: 'ఫ్లయింగ్ కార్'ను ఆవిష్కరించిన బోయింగ్ ... పరీక్ష విజయవంతం!

  • పట్టణ రవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పు
  • ఫ్లయింగ్ కార్ ప్రొటోటైప్ ను సిద్ధం చేసిన బోయింగ్
  • వర్జీనియా ఎయిర్ పోర్టులో పరీక్ష విజయవంతం

పట్టణ రవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకురాగల సరికొత్త వాహనాన్ని ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ తయారు చేసింది. ఫ్లయింగ్ కార్ ప్రొటోటైప్ ను సిద్ధం చేసిన బోయింగ్, దాన్ని తొలిసారిగా ప్రయోగించింది. ప్రపంచంలోనే అత్యధికంగా విమానాలను తయారు చేస్తున్న సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న బోయింగ్, ఈ వాహనంతో అర్బన్ ట్రాన్స్ పోర్టేషన్, డెలివరీ సేవలు మరింత సులభమవుతాయని చెబుతోంది. ఎయిర్ బస్ వంటి సంస్థలతో పోటీ పడుతూ, ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలు చేసే బోయింగ్, ఇప్పుడు నిట్టనిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ చేయడంతో పాటు రోడ్డుపై కారులా, ఆపై గాల్లో విమానంలో ప్రయాణించే వాహనాన్ని తయారు చేసింది.

30 అడుగుల పొడవు (9 మీటర్లు) ఉండే ఈ వాహనం, హెలికాప్టర్, డ్రోన్, కారు, విమానాల మేళవింపు. నేలపై నుంచి నిట్టనిలువుగా గాల్లోకి ఎగురుతుంది. విమానంలా దూసుకెళ్లి, రన్ వే లేకుండానే సులువుగా ల్యాండ్ అవుతుంది. దీన్ని వర్జీనియాలోని మనాసాస్ విమానాశ్రయంలో తొలిసారిగా పరీక్షించామని, అది విజయవంతం అయిందని బోయింగ్ పేర్కొంది.

More Telugu News