Hansika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • హ్యాక్ అయిన హన్సిక మొబైల్
  • మార్చి నెలలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్'
  • అల్లు అర్జున్ సినిమా అప్ డేట్
  • ఏభై దేశాల్లో 'మణికర్ణిక' విడుదల

*  తన మొబైల్ ఫోన్ ను, ట్విట్టర్ అకౌంటును ఎవరో హ్యాక్ చేశారని, తన ట్విట్టర్ లో వచ్చే పోస్టులకి స్పందించవద్దని కథానాయిక హన్సిక కోరింది. గత కొన్ని రోజులుగా ఆమెకు సంబంధించిన కొన్ని పర్శనల్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న నేపథ్యంలో హన్సిక ఆ విధంగా స్పందించింది.
*  రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని మార్చ్ నెలలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో చిత్రం టీజర్ ను రిలీజ్ చేస్తామని చెప్పారు.
*  అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందే చిత్రం కోసం కథానాయికను ఎంపిక చేసే పనిలో చిత్ర బృందం బిజీగా వుంది. కాగా, ఈ చిత్రం ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందుతుందట.
*  బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించిన 'మణికర్ణిక' చిత్రాన్ని రేపు గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో ఏభై దేశాల్లో దీనిని విడుదల చేస్తున్నారు.

More Telugu News