Virat Kohli: కోహ్లీకి విశ్రాంతి.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ

  • కోహ్లీపై విపరీతమైన పనిభారం
  • విశ్రాంతి ఇచ్చినట్టు పేర్కొన్న బీసీసీఐ
  • సారథ్యం వహించనున్న రోహిత్

ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగే చివరి రెండు వన్డేలతోపాటు టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు. చివరి రెండు వన్డేలు, టీ20 సిరీస్ నుంచి కోహ్లీకి విశ్రాంతి ఇస్తున్నట్టు బీసీసీఐ బుధవారం తెలిపింది. వరుస సిరీస్‌లతో కోహ్లీపై పనిభారం బాగా పెరిగిన నేపథ్యంలో టీం మేనేజ్‌మెంట్, సీనియర్ సెలక్షన్ కమిటీ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపింది.

గతేడాది శ్రీలంకలో జరిగిన నిదహాస్ ట్రోఫీ నుంచి కోహ్లీకి విశ్రాంతి ఇస్తూ వస్తోంది. జూన్‌లో బెంగళూరులో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌తోపాటు సెప్టెంబరులో యూఏఈలో జరిగిన ఆసియా కప్, విండీస్‌తో నవంబరులో జరిగిన టీ20 సిరీస్‌ల నుంచి కోహ్లీకి విశ్రాంతి ఇచ్చింది. కోహ్లీ స్థానంలో ఓపెనర్ రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించింది. గతేడాది కోహ్లీ మొత్తం 15 టెస్టులు ఆడి 1345 పరుగులు చేశాడు. అలాగే 18 వన్డేల్లో 1400 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

More Telugu News