Jayalalitha: జయలలితను అపరాధిగా పేర్కొనలేం: తేల్చి చెప్పిన మద్రాస్ హైకోర్టు

  • జయలలిత మెమోరియల్‌కు వ్యతిరేకంగా పిటిషన్
  • హైకోర్టును ఆశ్రయించిన దేశీయ మక్కల్ కచ్చి అధ్యక్షుడు
  • జయలలిత దోషి కాదన్న డివిజన్ బెంచ్

అక్రమ ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను అపరాధిగా పేర్కొనలేమని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. జయలలితకు మెమోరియల్ నిర్మించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌‌ను కొట్టివేసిన కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. జయలలిత మెమోరియల్ కోసం ప్రజల సొమ్మును ప్రభుత్వం ఖర్చు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశీయ మక్కల్ కచ్చి అధ్యక్షుడు ఎంఎల్. రవి హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే దీనిని నిలువరించాలని కోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

అక్రమాస్తుల కేసులో జయలలిత ఇప్పటికే దోషిగా ఉన్నారని, కాబట్టి ఆమె మెమోరియల్ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసి ఉంటే దానిని వెనక్కి తీసుకోవాలని కోరారు. పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ ఎం. సత్యనారాయణ్, పి.రాజమాణిక్యంలతో కూడిన డివిజన్ బెంచ్.. అక్రమాస్తుల కేసులో జయలలితపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడానికి ముందే ఆమె కన్నుమూశారని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

More Telugu News