భారత రాజకీయాల్లో ఎంతగానో ఎదురు చూసిన ఘడియ వచ్చేసింది: 'ప్రియాంక' ఆగమనంపై ప్రశాంత్ కిషోర్

- ప్రియాంక పొలిటికల్ ఎంట్రీపై ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకునే అవకాశం ఉంది
- రాజకీయాల్లో ఎదిగేందుకు ఆమె నిర్ణయించుకున్నారు
- ప్రియాంకకు శుభాకాంక్షలు
ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీష్ కుమార్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ లకు గతంలో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పని చేసిన సంగతి తెలిసిందే. ప్రియాంక గురించి పీకే స్పందన అతని బాస్ నితీష్ కుమార్ కు రుచించకపోవచ్చు. ఎందుకంటే గత ఏడాదే ఆర్జేడీ, కాంగ్రెస్ లతో తెగదెంపులు చేసుకుని బీజేపీతో నితీష్ పొత్తు పెట్టుకున్నారు. మరోవైపు, ప్రియాంక బాధ్యతలు స్వీకరించనున్న తూర్పు ఉత్తరప్రదేశ్ లోనే మోదీ నియోజకవర్గం వారణాసి కూడా ఉంది. గతంలో ప్రియాంకతో కలసి ప్రశాంత్ కిషోర్ పని చేశారు. సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో పొత్తు విషయంలో ఇద్దరూ కలిసే వ్యూహాలను రచించారు.