Honor View 20: ఈనెల 29న భారత్ లోకి 48 మెగాపిక్సెల్ 'ఆనర్ వ్యూ 20' స్మార్ట్ ఫోన్

  • తాజాగా పారిస్ లో విడుదల  
  • రెండు వేరియంట్ లలో లభ్యం 
  • అమెజాన్ లో ప్రత్యేకంగా విక్రయం

గత నెల చైనాలో లాంచ్ చేసిన ఆనర్ వ్యూ 20 స్మార్ట్ ఫోన్ తాజాగా పారిస్ లో కూడా విడుదల అయింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో మాత్రం ఈ నెల 29 న విడుదల కానుంది. దీనిలో 6 జీబీ/8 జీబీ పవర్ ఫుల్ ర్యామ్ తో పాటు వెనక భాగంలో రెండు 48/12 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్  స్టోరేజ్ వేరియెంట్ గల ఫోన్ ధర మనదేశంలో రూ.46,100 ధరకి లభించనుంది. అలాగే 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్ గల ఫోన్ రూ.52,500 ధరకి లభించే అవకాశం ఉంది. మిడ్‌నైట్ బ్లాక్‌, స‌ఫైర్ బ్లూ క‌ల‌ర్లలో లభించే ఈ ఫోన్ ను అమెజాన్ వెబ్ సైట్, ఆనర్ ఇండియా స్టోర్లలో ప్రత్యేకంగా విక్రయించనున్నారు.

More Telugu News