sensex: అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 336 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 91 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • నష్టపోయిన ఐటీ, బ్యాంకింగ్, ఆటో షేర్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయం ఫ్లాట్ గా ఆరంభమైన మార్కెట్లు... ఆ తర్వాత నష్టాల్లోనే కొనసాగుతూ, చివరకు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూలాంశాలు లేకపోవడంతో చివరి గంటలో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఈ క్రమంలో ఐటీ, బ్యాంకింగ్, ఆటో తదితర షేర్లు నష్టపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 336 పాయింట్లు కోల్పోయి 36,108కి పడిపోయింది. నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 10,831 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ లో ఐటీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ తదితర కంపెనీలు నష్టపోయాయి. యస్ బ్యాంక్, టాటీ స్టీల్, సన్ ఫార్మా, వేదాంత, హిందుస్థాన్ యూనీలీవర్ తదితర సంస్థలు లాభాల్లో ముగిశాయి.

More Telugu News