samanta: సమంత మూవీ టైటిల్లో మార్పు!

  • ముగింపు దశలో 'మజిలీ'
  • పట్టాలెక్కనున్న '96' రీమేక్
  •  నందినీ రెడ్డితో 'బేబీ'      

ఇటీవల కాలంలో సమంత .. నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎంచుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే నందినీ రెడ్డి సినిమాలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి ఇది రీమేక్. పైకి యంగ్ గా కనిపించడానికి తాపత్రయపడే ఓల్డ్ లేడీ పాత్ర ఇది. ఈ సినిమాకి 'ఓ బేబీ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. 'ఎంత సక్కంగున్నావే' అనేది ట్యాగ్ లైన్ గా పెట్టాలనుకున్నారు.

అయితే 'ఓ బేబీ' కాకుండా 'బేబీ' అనే టైటిల్ ను ఖరారు చేశారనేది తాజా సమాచారం. ట్యాగ్ లైన్ మాత్రం అదే ఉంటుంది. నాగశౌర్యతో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలను కూడా ఈ సినిమాకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 'మజిలీ' సినిమా చేస్తోన్న సమంత, '96' తమిళ మూవీ రీమేక్ లోను చేయనున్న సంగతి తెలిసిందే. 

More Telugu News