Brahmanandam: బ్రహ్మానందం చేసిన ఆ కామెడీ మేము రాశామనుకున్నారు: పరుచూరి గోపాలకృష్ణ

  • బ్రహ్మానందంతో మా మొదటి సినిమా 'లారీ డ్రైవర్'
  • 'రౌడీ ఇన్ స్పెక్టర్'లో ఆటో డ్రైవర్ గా కనిపిస్తాడు
  •  విమర్శలకి అప్పుడే సమాధానమిచ్చాము

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో బ్రహ్మానందాన్ని గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "బ్రహ్మానందం కోసం మంచి మంచి పాత్రలను క్రియేట్ చేస్తూ జంధ్యాల సినిమాలు చేస్తున్నారు. ఆ సమయంలోనే మేము రాసిన 'లారీ డ్రైవర్' సినిమాలో బ్రహ్మానందం మొదటిసారిగా ఒక రోల్ చేశాడు. ఆ వేషంతో బ్రహ్మానందం మరింత ఫోకస్ లోకి వచ్చాడు.

ఈ సినిమా తరువాత ఆయన మేము రాసిన 'రౌడీ ఇన్ స్పెక్టర్' చేశాడు. ఈ సినిమాలో ఆటో డ్రైవర్ అయిన బ్రహ్మానందం .. అంతా తన ఆటోనే ఎక్కాలనే ఉద్దేశంతో లేడీ గెటప్ వేసుకుంటాడు. ఆ ట్రాక్ లోనే కామెడీ నడుస్తూ వెళుతుంది. ఇలాంటి కామెడీ ట్రాక్ రాయడం పరుచూరి బ్రదర్స్ కి అవసరమా? అనే విమర్శలు వచ్చాయి. పత్రికల్లోనూ ఇదే విషయం రాసుకొచ్చారు. అయితే నిజానికి ఆ ట్రాక్ మేము రాయలేదు. అదే విషయాన్ని అప్పుడే చెప్పాము .. రోలింగ్ టైటిల్స్ చూడండి .. హాస్య రచయితగా వేరే వారి పేరు కనిపిస్తుందని చెప్పాము" అని అప్పటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.

More Telugu News