Lakshmis NTR: 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో ఈ ఇద్దరూ ఎవరో చెప్పుకోండి: రామ్ గోపాల్ వర్మ

  • 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై రోజుకో అప్ డేట్
  • ఇద్దరు కనిపిస్తున్న ఫోటోను పంచుకున్న వర్మ
  • వెరైటీగా స్పందిస్తున్న నెటిజన్లు

తాను నిర్మిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి సంబంధించి ఏదో ఒకటి చెబుతూ నిత్యమూ వార్తల్లో ఉంటున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నేడు తన అభిమానుల ముందుకు ఓ ప్రశ్నను తీసుకు వచ్చారు. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరూ ఎవరో చెప్పుకోవాలని అడుగుతూ, చిత్రంలో ఎన్టీఆర్ పాత్రధారి దీర్ఘాలోచనలో ఉండగా, వెనుకవైపు చంద్రబాబు పాత్రధారి ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ పిక్ పై నెటిజన్లు వెరైటీగా స్పందిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో పంచుకున్న ఫోటోను మీరూ చూడవచ్చు.




More Telugu News