Andhra Pradesh: అమరావతికి ఇంకా తరలిరాని న్యాయ సంస్థలు.. కొరడా ఝుళిపించిన ఏపీ ప్రభుత్వం!

  • జీతాలు నిలిపివేయాలని ఉత్తర్వుల జారీ
  • జాబితాలో ఏజీ ఆఫీసు, లీగల్ సర్వీస్ అథారిటీ
  • ఇప్పటికే అమరావతికి వచ్చిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇటీవల హైకోర్టు విభజన జరిగిన సంగతి తెలిసిందే. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో న్యాయస్థానం తాత్కాలికంగా పనిచేస్తోంది. అయితే న్యాయపరమైన ప్రభుత్వ సంస్థలు మాత్రం ఇంకా హైదరాబాద్ లోనే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో అడ్వొకేట్ జనరల్ కార్యాలయం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం, ట్రైబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రోసీడింగ్స్, ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ సహా పలు శాఖలపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది.

సొంత రాష్ట్రానికి తరలిరాని ఈ సంస్థల్లోని ఉద్యోగులకు వేతనాలను నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. పైన పేర్కొన్న సంస్థలతో పాటు సాధారణ పరిపాలన శాఖ, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ కేడెట్ కోర్, స్టేట్ ఆర్చీవ్స్ డిపార్ట్ మెంట్, పే అండ్ అకౌంట్స్ కు జీతాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసింది.

More Telugu News