Andhra Pradesh: లోకేశ్ చిన్న పిల్లాడు.. టీడీపీ గురించి చాలా నిజాయతీగా చెప్పాడు!: నాగబాబు సెటైర్

  • గతంలో లోకేశ్ వ్యాఖ్యల ప్రస్తావన
  • నిజాలు చెప్పినందుకు థ్యాంక్స్
  • కొత్త ఛానల్ పేరు ప్రకటించిన నాగబాబు

చిన్నపిల్లలు దేవుడులాంటి వారనీ, వాళ్లకు కల్లాకపటం తెలియదని చిన్నప్పుడు ఓ పాట వినేవాళ్లమని మెగాబ్రదర్ నాగబాబు తెలిపారు. పిల్లలు ఎప్పుడూ నిజాలే మాట్లాడుతారనీ, చెడుమాటలు ఉండవని వ్యాఖ్యానించారు. తాను ‘మై ఛానల్ నా ఇష్టం’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ను పెట్టానని పేర్కొన్నారు. ఈ వేదిక నుంచి తన రాజకీయ విమర్శలను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

గతంలో టీడీపీ నిర్వహించిన ఓ సభలో ‘ఎలాంటి బంధుప్రీతి, మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదన్నా ఉందంటే అది టీడీపీనే’ అంటూ లోకేశ్ పొరపాటున చేసిన వ్యాఖ్యలను నాగబాబు ఈ వీడియోలో ప్రస్తావించారు. ‘ఇంత నిజాయతీగా ముందుకు వచ్చి మీ పార్టీ గురించి నిజాలు చెప్పినందుకు థ్యాంక్యూ లోకేశ్ గారూ’ అని చెప్పారు. ఇంత నిజాయతీగా ఉండటం దేశంలోని ఏ రాజకీయ నాయకుడికీ సాధ్యం కాదని కితాబిచ్చారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.

More Telugu News