Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సినిమా వ్యక్తిని చేసుకోనంటున్న కాజల్ 
  • రెండు సీక్వెల్స్ చేయనున్న నాగార్జున 
  • త్వరలో లారెన్స్ బాలీవుడ్ సినిమా 
  • వైఎస్ బయోపిక్ 'యాత్ర'కు సెన్సార్ పూర్తి 

*  సినిమా రంగానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోనని చెబుతోంది కథానాయిక కాజల్ అగర్వాల్. 'ఇక్కడి వాళ్లంతా నాకు తెలుసు. అంతా స్నేహితులే. వాళ్లల్లో ఎవరినీ జీవిత భాగస్వామిగా చేసుకోలేను' అని చెప్పింది.
*  ప్రస్తుతం అక్కినేని నాగార్జున రెండు సీక్వెల్స్ మీద దృష్టి పెట్టారు. వీటిలో ఒకటి 'సోగ్గాడే చిన్ని నాయనా'కి సీక్వెల్ గా రూపొందే 'బంగార్రాజు' కాగా, మరొకటి 'మన్మథుడు 2'. ఈ రెండు చిత్రాలూ కూడా ఇంచుమించు ఒకేసారి సెట్స్ కి వెళతాయి.
*  తెలుగులో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ త్వరలో హిందీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. గతంలో తాను తీసిన 'కాంచన' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నాడు. ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తాడు.
*  వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా రూపొందిన 'యాత్ర' చిత్రం సెన్సార్ పూర్తయింది. దీనికి క్లీన్ U సర్టిఫికేట్ లభించింది. వచ్చే నెల 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

More Telugu News