ap7am logo

పలు ఫీచర్లతో వివో నుండి నూతన స్మార్ట్ ఫోన్

Tue, Jan 22, 2019, 02:58 PM
  • చైనాలో విడుదలైన 'వివో వై89'
  • ధర సుమారు రూ.16,700
  • రెండు రంగులలో ఆప్షన్ లలో లభ్యం
మొబైల్ తయారీదారు వివో తాజాగా చైనాలో 'వివో వై89' పేరిట నూతన స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అరోరా పర్పుల్, బ్లాక్ గోల్డ్ రంగులలో లభించే ఈ ఫోన్లో భారీ టచ్ స్క్రీన్ (6.26"), స్నాప్ డ్రాగన్ 626 ప్రాసెసర్ లాంటి పలు ఆకట్టునే ఫీచర్లు ఉన్నాయి. మన దేశంలో ఇది సుమారు రూ.16,700 ధరకి లభించే అవకాశాలున్నాయి. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది.

ప్రత్యేకతలు:

  • 6.26" ఫుల్ హెచ్డీ ప్ల‌స్ డిస్ప్లే
  • 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌
  • ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టం
  • 16/2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
  • 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
  • ఆక్టాకోర్ 626 ప్రాసెసర్
  • 3260 ఎంఏహెచ్ బ్యాట‌రీ
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad