టాలీవుడ్ సహాయ దర్శకుడి బైక్ చోరీ!
- రెచ్చిపోయిన బైక్ దొంగలు
- బోయిన్ పల్లి వద్ద బైక్ దొంగతనం
- పద్మారావు నగర్ లో మరొకటి
- దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, అశోక్ కుమార్, 15వ తేదీన తన బైక్ తో బోయిన్ పల్లి పరిధిలోని బాటా చౌరస్తా వద్దకు వెళ్లారు. అక్కడ తమ బండిని పార్క్ చేసి (ఏపీ 09 సీజే 9804) పని చూసుకుని వచ్చేసరికి దాన్ని దోచుకెళ్లారు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఇక, రఘు... శివాజీ దేవాలయానికి వెళ్లి తన బైక్ ను పార్క్ చేసి, కాసేపటి తరువాత వచ్చి చూడగా, అది మాయమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులను విచారిస్తున్నారు.