Chittoor District: చిత్తూరులో ‘కృష్ణమ్మ’ పరుగులు.. మేళతాళాలతో ఆహ్వానం

  • చిత్తూరులోకి కృష్ణా జలాల ప్రవేశం
  • ఆనందంతో ఉప్పొంగిన ప్రజలు
  • సస్యశ్యామలం కానున్న చిత్తూరులోని పశ్చిమ మండలాలు

కరవుతో అల్లాడే చిత్తూరు జిల్లాలోని పీలేరు, పుంగనూరు, పలమనేరు, కుప్పం, తంబళ్లపల్లె నియోజకవర్గాలు ఇక సస్యశ్యామలం కానున్నాయి. హంద్రీ-నీవా జలాలు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించాయి. కృష్ణమ్మ గలగలలతో ఆ ప్రాంత వాసులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. మేళతాళాలు, బాజాభజంత్రాలతో ఆహ్వానించారు. హారతులు పట్టి  బోనాలు సమర్పించారు. అనంతరం కృష్ణ జలాల్లో తనివి తీరా స్నానం చేశారు.

సోమవారం ఉదయం హంద్రీ-నీవా జలాలు అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా పెద్ద తిప్పసముద్రం మండలంలోకి ప్రవేశించాయి. వందల ఏళ్లుగా నీటి జాడ తెలియని ఇక్కడి ప్రజలు ‘కృష్ణమ్మ’ను చూసి మైమరచిపోయారు. భక్తితో పసుపు, కుంకుమ, పుష్పాలు సమర్పించి పూజలు చేశారు.

తిప్ప సముద్రం చేరుకున్న కృష్ణా జలాలతో నేడు అక్కడి పెద్ద చెరువు నిండనుంది. అక్కడి నుంచి పుంగనూరు బ్రాంచి కెనాల్ ద్వారా మదనపల్లె,  పుంగనూరు ప్రాంతాలకు నీటిని తరలిస్తారు. వచ్చే నెలాఖరు నాటికి పలమనేరు, కుప్పం ప్రాంతాలు కూడా కృష్ణా జలాలతో కళకళలాడనున్నాయి. <iframe src="https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fchittoorgoap%2Fvideos%2F371006817061475%2F&show_text=0&width=560" width="560" height="308" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allowFullScreen="true"></iframe>

More Telugu News