Andhra Pradesh: ఏపీ మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

  • ఒక్కో ఇంటికి రూ.60 వేలు మంజూరు చేయాలి
  • డ్వాక్రా మహిళలకు సెల్ ఫోన్లు ఇవ్వాలి
  • చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా వర్తింపజేయాలి  

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ చెల్లింపునకు, ఐటీ ప్రోత్సాహకాల చెల్లింపునకు, ట్రాక్టర్లు, ఆటోలకు జీవితకాలం పన్ను మినహాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

కాగా, రాజధానిలో నివాసం ఉండే ఉద్యోగులు, అధికారులు, జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణంపై కేబినెట్ లో చర్చించారు. రాజధానిలో జర్నలిస్ట్ సొసైటీకి 25 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. అయితే, సీఆర్డీఏ చట్టంలో నిబంధనలు పొందుపర్చాక వచ్చే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు.  

పలు కీలక నిర్ణయాలు...

- 2014 నుంచి అనుమతి లేకుండా నిర్మించిన 1.66 లక్షల పేదల ఇళ్లకు  
   రూ.756 కోట్లు చెల్లించాలి
- ఒక్కో ఇంటికి రూ.60 వేలు మంజూరు చేయాలి
- ఇంటి మరమ్మతులకు రూ.45 వేలు, మరుగుదొడ్డికి రూ.15 వేలు ఇవ్వాలి
- 1996-2004 మధ్య ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల మరమ్మతులకు రూ.10 వేలు
  ఇవ్వాలి
-  డ్వాక్రా మహిళలకు సెల్ ఫోన్లు ఇవ్వాలి
- చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా వర్తింపజేయాలి   

More Telugu News