Anil Ravipudi: 70 కోట్లు వసూలు చేసిన ‘ఎఫ్ 2’?

  • రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది
  • తొలి వారంలో రూ.61.43 కోట్లు వసూలు
  • 2 మిలియన్ డాలర్ల దిశగా పరుగులు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ ‘ఎఫ్2’. తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం ఇప్పటికి దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసిందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎఫ్2’ తొలి వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.61.43 కోట్లు వసూలు చేసిందట. ఇక అమెరికా బాక్సాఫీస్ వద్ద అయితే 2 మిలియన్ డాలర్ల దిశగా వెళుతోందని చిత్రబృందం వెల్లడించింది.

More Telugu News