Australia open: ఘోర పరాజయం.. రాకెట్ ను నేలకేసి బాదిన జర్మన్ క్రీడాకారుడు!

  • ఆస్ట్రేలియా ఓపెన్ లో ఆసక్తికర సంఘటన
  • నాల్గో సీడ్ క్రీడాకారుడు అలెగ్జాండర్ జ్వెరెవ్
  • ఆరో సీడ్ కెనడా క్రీడాకారుడు మిలోస్ రావ్ నిచ్
  • మిలోస్ చేతిలో ఓడిపోయిన అలెగ్జాండర్

ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన కంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న క్రీడాకారుడు తనను ఓటమిపాలు చేయడంతో ఓ ఆటగాడు తట్టుకోలేక తన చేతిలోని రాకెట్ ను నేలకేది బాదేశాడు. ఆస్ట్రేలియా ఓపెన్ లో భాగంగా ఈరోజు జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ లో జర్మనీ దేశానికి చెందిన నాల్గో సీడ్ క్రీడాకారుడు అలెగ్జాండర్ జ్వెరెవ్, కెనడాకు చెందిన ఆరో సీడ్ క్రీడాకారుడు మిలోస్ రావ్ నిచ్ వరుస తలపడ్డారు.

అయితే, వరుస సెట్లలో 1-6,1-6, 6(5)-7 తేడాతో అలెగ్జాండర్ జ్వెరెవ్ పై మిలోస్ రావ్ నిచ్ విజయం సాధించాడు. దీంతో, తట్టుకోలేకపోయిన అలెగ్జాండర్ జ్వెరెవ్ అభిమానులందరూ చూస్తుండగానే తన చేతిలోని రాకెట్ ను కోర్టులోనే నేల కేసి బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.  

అనంతరం, అలెగ్జాండ్ జ్వెరెవ్ మాట్లాడుతూ, ఆ సమయంలో తన కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోయానని, అందుకే, తన నిరాశ నిస్పృహలను ఈవిధంగా బయటపెట్టాల్సి వచ్చిందని అన్నాడు. తొలి రెండు సెట్లలో తన ఆటతీరు ఘోరంగా ఉందన్న అలెగ్జాండర్, ప్రత్యర్థి మిలోస్ రావ్ నిచ్ ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు.

More Telugu News